AMC CHAIRMAN Kududula Venkanna | మంథని, జూలై 30: రైతులకు మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మెరుగైన సేవలందిస్తామని మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్నను స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకన్న చైర్మన్, వైస్ చైర్మన్‌గా ముస్కుల ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్లుగా మంథని సదానందం, కన్నబోయిన ఓదెలు, ఎండీ. అంకూస్, రేగళ్ల రామ్మోహన్రావు, ఊదరి శంకర్, గడ్డం పోచయ్య, ఆజ్మీరా చందునాయక్, పన్నాల ఓదెలు, దూలం సులోచన, లింగంపల్లి నర్సింగారావు, రావికంటి వెంకటేష్, ఎల్లంకి శంకర్లింగం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు.
నూతనంగా కొలువు ధీరిన చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులను మాజీ ఎంపీపీ కొండ శంకర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఐయిలి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరాంభట్ల సంతోషిణీ, కాంగ్రెస్ నాయకులు శ్రీరాంభట్ల శ్రీనివాస్, పెండ్రి సురేష్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.