Minister Laxman Kumar | పెగడపల్లి: ఎన్నికల్లో హమీ ఇచ్చిన మేరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరు గ్యారంటీలు తప్పని సరిగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ క్కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం లింగాపూర్ లో శుక్రవారం పనుల జాతర 2026 కార్యక్రమంలో భాగంగా ఈజీఎస్ నిధులు రూ.12 లక్షలతో చేపట్టే అంగన్వాడీ భవనం, రూ.20 లక్షలతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అర్హులకు రేషన్ కార్డుల మంజూరుతో పాటు, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు వివరించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ లో బతికపల్లి, దేవికొండలో విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందిన రెండు రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం, 53 మందికి 18.50 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు.
అలాగే ఐతుపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్. లత, ఆర్డీవో మధుసూధన్ గౌడ్, డీఆర్డీవో రఘువరన్, జిల్లా సంక్షేమ అధికారి నరేష్, మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్, ఎంపీడీవో శ్రీనివాస్ డ్డి, తహసీల్దార్ రవిందర్, ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఈఈ లక్ష్మణావు, డీఈ అశ్విన్, ఏడీఈ వరుణ్ కుమార్, ఏరులు శంషేర్అలీ, వెంకటరెడ్డి, మండల వైద్యాధికారి నరేష్, సీడీపీవో వీరలక్ష్మి, సూపర్వైజర్లు మహేశ్వరి, పవిత్ర, ఏఎంసీ వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, నాయకులు శ్రీనివాస్, తిరుపతి, మల్లారెడ్డి, కిషన్, రాంరెడ్డి, రాజు, శేఖర్, భాస్కర్ తదితరులున్నారు.