local body elections | జగిత్యాల : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సూచించారు. అంబర్పేట్ గ్రామంలో జగిత్యాల అర్బన్ మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసి రాబోయే స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలను ఎండగడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ప్రణాళిక వేసుకుని పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రూరల్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్, ఐల్నేని ఆనందరావు, మాజీ సర్పంచ్ లు గోడిసెల గంగాధర్, కరుణాకర్, లక్ష్మణ్ రావు, బుర్ర ప్రవీణ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ నారాయణ, నాయకులు కమలాకర్ రావు, సాగర్ రావు, ముత్తయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.