Korukanti Chander | అంతర్గాం, అక్టోబర్ 6: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సైనికులు తమ సత్తా చాటాలని బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గులాబీ సైనికులు కృషి చేయాలని రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అంతర్గాం మండల ముఖ్య నాయకుల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం రామగుండం పట్టణంలోని ఏవీ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల్లో ప్రజలు అరిగోస పడుతున్నారని అన్నారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతులను రాజుగా మార్చితే కాంగ్రెస్ పాలనలో రైతులను రోడ్డుమీదికి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, ప్రతీ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతర్గాం ను మండలంగా, ఎంపీడీవో పోలీస్ స్టేషన్ కార్యాలయం భవనాల నిర్మాణం చేసింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. రామగుండం నియోజకవర్గంలో పాలకుర్తి అంతర్గాం మండలం రైతులకు ప్రతీ ఎకరాకు నీరు అందించేందుకు లక్ష్యంతో రూ.60 కోట్లతో మూర్మూర్ వద్ద లిప్ట్ ఏర్పాటు చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. లిప్ట్ ద్వారా 27 ఎల్ 17ఎల్ ద్వారా ప్రతీ ఎకరాకు సాగునీరు అందించే ఆలోచన కేసీఆర్ హయాంలోనే జరిగిందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరించాలని, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను గ్రామంలోని ప్రతీ ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు అందించాలని సూచించారు. పార్టీకి కార్యకర్తలే బలమని కార్యకర్తలు సైనికుల్లా పని చేసింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి అని కోరారు. మాజీ కార్పోరేటర్ కౌశిక లత మాట్లాడుతూ… ఆడ బిడ్డను ఆశీర్వదించాలని, రాబోవు ఎన్నికల్లో అంతర్గాం జడ్పీటీసీగా గెలిపించాలని కోరారు. అంతర్గాం మండల బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తల అండ దండలతో ముందుకు సాగుతానని, బీఆర్ఎస్ శ్రేణులను తాము కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరించాలని ప్రతీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ బాకి కార్డులు అందించాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులకు అండగా నిలుస్తామని, వారికి ధైర్యంగా ఉంటామని అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ మోసాలతో విసిగిపోయారని, కేసీఆర్ పాలనను కోరుతున్నారు. .రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు అయులయ్య యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కొల సంతోష్ గౌడ్, మట్ట లక్ష్మి, బండారి ప్రవీణ్, ధరణి రాజేష్, కొలిపాక మధుకర్ రెడ్డి, ధర్మాజీ కృష్ణ, సందెల మల్లయ్య, కొల్లూరి సతీశ్, రాములు, రమణా రెడ్డి, జేవీ రాజు, పర్లపల్లి రవి, నిమ్మరాజుల రవి, తుంగపిండి సతీశ్, ఎలుక కొమురయ్య పాల్గొన్నారు.