Iftu |రామగిరి, ఏప్రిల్ 20: ఆర్జీ 3 డివిజన్ పరిధిలోని ఓసీపీ -1 లోని సెక్షన్ వద్ద ఆదివారం ఐ ఎఫ్ టీ యూ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యాక్రమానికి ఎస్ సి సి డబ్ల్యూ యు (ఐ ఎఫ్ టీ యు)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న హాజరై మాట్లాడారు.
అధికార మార్పిడీకి 77 ఏళ్ల తర్వాత కూడా దేశంలో కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత లేదని ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పర్మనెంట్ కార్మికులకు బదులుగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను నియమిస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీము వర్కర్లను కార్మికులుగా కూడా గుర్తించడం లేదని 90% అసంఘటితరంగా కార్మికులకు చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు లేవని, కార్మిక చట్టాలు అమలులో ఉన్న స్థితిలో సైతం పాలకవర్గ పార్టీలు కార్మిక హక్కులపై ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయి.
నాలుగు లేబర్ కోట్లు అమలు అయితే కార్మిక వర్గం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాటిని వెనక్కి కొట్టాల్సిన అవసరం ఉందని, ఈ 139వ మే డే పిలుపులో భాగంగా నాలుగు లేబర్ కోడ్ లు రద్దు అయ్యే వరకు పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరేసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయు) ఆర్జీ-3 డివిజన్ నాయకులు పి రమేష్, పి రాజనర్సు, జి లింగయ్య, ఎస్ శ్రీనివాస్, శ్రీనివాస్, సంపత్, ఇమామ్, రాజమౌళి, పీరయ్య , హైమద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.