కరీంనగర్ రూరల్, అక్టోబర్ 25: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నిరుపేద చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని, నగునూరులోని ప్రతిమ దవాఖాన, ప్రతిమ ఫౌండేషన్, లండన్‌లోని హీలింగ్ హర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో చిన్న పిల్లల గుండె వ్యాధుల ఉచిత శస్త్ర చికిత్స శిబిరం నిర్వహిస్తూ ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నామని ప్రముఖ వైద్యుడు రమణ దన్నపునేని (కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ అల్డర్ హే చిల్డ్రన్స్ హాస్పిటల్ లివర్‌పూల్ యూకే) పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రతిమ దవాఖానలో ఎనిమిదో చిన్న పిల్లల గుండె వ్యాధుల ఉచిత శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించగా, శనివారం జరిగిన ముగింపు కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి, మాట్లాడారు.
ప్రతిమ వైద్యశాలలో 2017 నుంచి ఏటా చిన్నపిల్లలకు గుండె చికిత్సకు సంబంధించిన శిబిరాలు నిర్వహిస్తూ, ఇప్పటివరకు 120 మందికి ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. ప్రస్తుత శిబిరంలోనూ 700 మందికి స్క్రీ నింగ్ చేసి 13 మందికి శస్త్ర చికిత్స చేశామని తెలిపారు. రాష్ట్రంలో గుండె వ్యాధులతో బాధపడుతున్న ప్రతి చిన్నారికి శస్త్ర చికిత్స అందుబాటులోకి తేవాలన్న మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్, ప్రతిమ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ హరిణి, ప్రతిమ సంస్థ అధినేత బోయినిపల్లి శ్రీనివాస్ రావు సదాశయాన్ని అందరి సహాయ సహకారాలతో నెరవేర్చుతున్నామని చెప్పారు. గుండె జబ్బు వస్తే భయం వద్దని, ఆపరేషన్‌కు ముందుకు రావాలని సూచించారు.
వైద్యశాల సీఈవో రాంచంద్రర్రావు మాట్లాడుతూ చిన్నారులకు గుండె సర్జరీ చాలా రిస్క్‌తో కూడుకున్నదని, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ రమణా దన్నపునేని బృందం చాలా హార్డ్ వర్క్ చేస్తూ చిన్నారులకు ప్రాణదాతలుగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా సర్జరీలలో పాల్గొన్న యూకే వైద్య బృందంతోపాటు, డాక్టర్ రమణ దన్నపునేని, డాక్టర్ దన్నపునేని శిరీష దంపతులను సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాబ్జాన్సన్, మేరీ హోరాన్, సయ్యద్ సనౌల్లా, శ్రీదీప్, డాక్టర్ నందన్వేణుగోపాల్, వైద్యశాల హెచ్వోవీ పీడియాట్రిక్స్ డాక్టర్ చెన్నాడి అమిత్‌కుమార్, ప్రిన్సిపాల్ పీఎల్, జాన్ ఇస్రేల్, ప్రతిమ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీఎన్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిషన్‌రెడ్డి, రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేటివ్ అఫీసర్ ప్రసాద్‌రావు, ఆకుల విద్యాసాగర్, డాక్టర్ ప్రవీన్‌కుమార్, డాక్టర్ రాజాసుమన్ దత్త, డాక్టర్ నిఖిల్, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మేము ఆరెకరాల పొలమేసినం. మాకు అందాదకొద్ది 180 క్వింటాల్ల వడ్లు వచ్చినయ్. మా ఊరి రైతులం 40 మందిమి 20 రోజుల కిందనే సెంటర్‌కు వడ్లు తెచ్చినం. 13 రోజుల కింద సార్లు, మా ఊరోల్లు వచ్చి కొబ్బరికాయ కొట్టి చాలుజేసి పోయిర్రు. ఇప్పటిదాక ఇంక వడ్లు కొనుడు మొదలు పెట్టలేదు. నిన్న వానచ్చి వడ్లన్నీ తడిసినయి. మా ఒక్కల్లయే 4 క్వింటాళ్ల వడ్లు అందూట్లకు, మడుగులకు కొట్టుకపోయినయ్. మల్ల వానత్తె ఎండబోసి మాచర్ వచ్చేదాక ఉంచుడైతది. ఇవారకు కొనుడు చాలు జేస్తే వడ్లన్నీ పోతుండె.
– ఏనుగు లక్ష్మి, రైతు, గుండారం, ఎల్లారెడ్డిపేట