Putta Madhukar | రామగిరి, మే 12 : అనేక కష్టాలను ఎదుర్కొంటూ తమ చదువుల కోసం త్యాగాలు చేసే తల్లిదండ్రుల కలలకు సాకారం చేకూర్చాలని, ఈ బాధ్యత ప్రతీ విద్యార్థిపై ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన మైదం స్వప్న-సతీష్ దంపతుల కుమార్తె హాన్షిక రామగుండం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించిన సందర్భంగా ఆమెతో పాటు ఆమె తల్లితండ్రులకు పుట్ట మధూకర్ శైలజ దంపతులు ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైదం హన్షిక ఎంబీబీఎస్ సీటు సాధించడం గర్వించదగిన విషయమన్నారు. వైద్య వృత్తిని ఎంచుకున్న హన్షిక పేద ప్రజలకు సేవలు అందించాలని, సామాజిక సేవలో తనవంతు సహకారం అందించాలని ఆయన సూచించారు. వైద్య వృత్తి ఎంతో గొప్పదని, పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలోని హనుమాన్ ఆలయంలో పుట్ట మధూకర్ శైలజ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.