DRDO Kalindi | పెద్దపల్లి రూరల్ జూలై 12 : అంగన్ వాడీ కేంద్రాల ద్వారా తల్లి బిడ్డలకు పోషక ఆహారం అందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాళిందిని అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వలలో శనివారం ఇందిరా మహిళా శక్తి సంబురాలల్లో భాగంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి వాటి ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రతల గురించి సభ్యులందరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య లు వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల అందే ప్రయోజనాలను వివరించారు. ప్రభుత్వం నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆరోగ్య సేవలను సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సంపత్, అంగన్ వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.