GP tractors | మల్లాపూర్ జూన్ 11: రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల జేఏసీ పిలుపు మేరకు మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జీపీ ట్రాక్టర్ల తాళాలను ఎంపీఓ జగదీష్ కు అప్పగించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ తమకు వస్తున్న జీతాలతో ప్రతీ నెల గ్రామాల్లో సానిటేషన్, ఎలక్ట్రికల్ పనులతో పాటు జీపీ ట్రాక్టర్ల నిర్వహణకు ఖర్చు పెడుతున్నామన్నారు.
తదనంతరం సంబంధించిన బిల్లులు తమకు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గ్రామాల్లో సర్పంచుల పాలన లేకపోవడంతో ప్రతీ సమస్య తామే పరిష్కరిస్తున్నామని, ప్రతీ రోజు మానసిక ఒత్తిడి తప్పడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.