గోదావరిఖని, మే 6: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి కొ ప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచిలా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. గోదావరిఖని జేఎల్ఎన్ స్టేడియంలో సోమవారం ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సభ ఏర్పాట్లు, పోలీస్ కమిషనరేట్ భవన ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీపీ రెమా రాజేశ్వరి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌తో కలిసి పరిశీలించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రజలకు జవాబుదారీగా మార్చారన్నారు. పోలీస్ వ్యవస్థ పటిష్టం, ప్రజలకు మెరుగైన సేవల కోసమే కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దని, అసత్య ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. వారి వెంట మేయర్ అనిల్‌కుమార్, పార్టీ నాయకులు ఉన్నారు.
యువతకు స్ఫూర్తి ప్రదాత కేటీఆర్
తెలంగాణ యువతకు స్ఫూర్తి ప్రధాత కేటీఆర్. రామగుండం నవ నిర్మాణ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నాం. సింగరేణి స్టేడియంలో బహిరంగ సభ, పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. రామగుండానికి కేటీఆర్ మరిన్ని వరాలు ఇస్తారని ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే