water tank | వేములవాడ రూరల్, జూలై 5 : నీటి సంపులో పడి ఓ బాలుడు(6) మృతి చెందాడు. ఈ సంఘటన వేములవాడ మండలం చింతల్టన గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లింగంపల్లి స్వప్న-రవి ఏకైక కుమారుడు లింగంపల్లి రిషీ (6) తన స్నేహితుల తో కలిసి ఇంటి సమీపంలోని కొత్తగా నిర్మాణం అవుతున్న భవనం వద్ద ఆడుకుంటున్నారు.
కాగా ప్రమాదవశాత్తు రిషీ నీటి సంపులో పడిపోగా స్నేహితులు చూసి కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా వారు వచ్చి చూసే సరికి రిషీ మృతి చెంది ఉన్నాడు. రవి-స్వప్న దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కాగా రిషీ ఒక్కడే కుమారుడు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.