YELLAREDDYPETA | ఎల్లారెడ్డిపేట, మార్చి 30: గత కొంతకాలంగా ప్రభుత్వ పైలట్ గ్రామం గుండారం లోని పోచమ్మ తండా తాగునీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఉగాది పండుగ రోజు నీళ్లు లేకపోవడంతో పోచమ్మ తండావాసులు డ్రమ్ములు బకెట్లు బిందెలు రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు.
తమ తండాలో సుమారు 16 ఇండ్లకు తాగునీరు రావడంలేదని 15 రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కార్యదర్శి దేవరాజును వివరణ కోరగా కొన్ని రోజులుగా ఆ తండాలో తాగునీటి ఇబ్బంది ఉందని అందుకోసం మిషన్ భగీరథ నీటికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ తో నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు.
సమస్య గురించి తెలుసుకుంటానని తెలుసుకొని ట్యాంకర్ తో నీళ్లను అందిస్తామని ఆయన తెలిపారు. ట్యాంకర్ తో నీళ్లను అందించకుండా శాశ్వత పరిష్కారం చూపాలని తండావాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.