Kakatiya Canal | తిమ్మాపూర్,సెప్టెంబర్3: లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కెనాల్ ను నుండి దిగువకు నీటిని విడుదల చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎల్ఎండీ రిజర్వాయర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేష్ తో కలిసి బుధవారం ఉదయం నీటి విడుదలను ప్రారంభించారు.
24టీఎంసీ సామర్థ్యం గల ప్రస్తుతం ఎల్ఎండీ రిజర్వాయర్ 22 టీఎంసీలతో నిండుకుండలా మారడంతో అధికారులు ముందస్తు అప్రమత్తతగా కెనాల్ నుండి నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.