Godavarikhani | కోల్ సిటీ, మే 14: వీహెచ్ఎర్ ఫౌండేషన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. రామగుండం పట్టణంకు చెందిన బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అతహరొద్దీన్ కిరాయికి ఆటో తీసుకొని నడుపుకుంటున్నాడు. దాంతో వచ్చిన డబ్బులు ఆటో కిరాయికే సరిపోతుండగా ఇల్లు గడవడం కష్టమవుతుంది. ఎప్పటి నుంచో సొంత ఆటో కొనుక్కోవడానికి అనుకున్న చేతిలో డబ్బులు లేక అపసోపాలు పడుతున్న విషయం తెలుసుకున్న వ్యాల్ల హరీష్ రెడ్డి స్పందించి ఫౌండేషన్ ద్వారా మొదటి విడతగా రూ.30వేలు పంపించారు.
ఈమేరకు బుధవారం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాహిద్ పాషా ఆధ్వర్యంలో గోదావరిఖని ఐబీ కాలనీలో అంతర్గాం మండల మాజీ జడ్పీటీసీ అముల నారాయణ చేతుల మీదుగా అతహరొద్దీన్ కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సప్త సముద్రాల అవతల ఉన్నప్పటికీ పుట్టి పెరిగిన ఊరును మరచిపోకుండా ఇక్కడ కష్టాల్లో ఉన్నవారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న హరీష్ రెడ్డి పార్టీ కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకొని ఆటో కొనుక్కోవడానికి సాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, నాయకులు బక్కి కిషన్, పొలాడి శ్రీనివాసరావు, రొడ్డ సంపత్, నాగుల మోహన్ రావు, గోపి, కొయ్యడ రమేష్, నూతి రాజ్ కుమార్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.