“తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం.. ఆయన ముఖ్యమంత్రిగా లేని తెలంగాణ ఊహించకోలేం. ఇప్పుడు ఒక్క ఓటు తప్పు జరిగితే రాష్ట్రం మళ్లీ అంధకారం అవుతుంది. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కోతలు తప్పవు.. ఆ పార్టీని నమ్మితే మునిగిపోతాం. అభివృద్ధి చేసేవారికి ఓటు వేయండి” అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఉదయం కరీంనగర్ రూరల్ మండలంలోని చెర్లభూత్కూర్, తాహెర్ కొండాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం సాగించారు. సాయంత్రం నగరంలోని 3, 24, 25, డివిజన్లలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు, డివిజన్ల ప్రజలు మంగళహారతులు పట్టి, పూలు చల్లుతూ ఘనస్వాగతం పలుకగా, ఆయాచోట్ల మంత్రి ప్రసంగించారు.
– కార్పొరేషన్/ కరీంనగర్‌రూరల్, నవంబర్ 11
కరీంనగర్ రూరల్: నవంబర్07 : “తెలంగాణ ప్రగతి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్‌రూరల్ మండలంలోని చెర్లభూత్కూర్, తాహెర్ కొండాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రికి గజమాలలు వేసి, మంగళ హారుతులు పట్టి డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. ఎస్సీకాలనీలో పాదయాత్రగా ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓటు అమ్యూలమైనదని, ఒక్క ఓటు తప్పు జరిగితే తెలంగాణ మళ్లీ అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు కావాలా..? లేదా ఎన్నికలప్పుడే కనిపించే నాయకుడు కావాలో మీరే అలోచించు కోవాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పార్టీలని, అవి రెండూ ఒకటేనని, వారికి అధికారం కట్టబెడితే… మరోసారి తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేస్తారని, ఢిల్లీలో సమైక్యాంధ్రుల పెత్తనం నడుస్తుందని, హైదరాబాద్ సంపదను కొల్లగొడుతారని చెప్పారు. రౌడీషీటర్లు, భూకబ్జాదారులకు టిక్కెట్ ఇచ్చే ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని విమర్శించారు. నాడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో రైతులు అనేక కష్టాలు పడ్డారని, వేళాపాలా లేని కరెంటుతో పాము కాట్లకు గురై వందలాది రైతులు మృతి చెందారని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యే కాకముందు చెర్లభూత్కూర్, తాహెర్ కొండపూర్ ఎలా ఉండేవని, ఇప్పడు ఎలా ఉన్నాయో ఆలోచించుకొని ఓటు వేయాలని సూచించారు. రూ.వందల కోట్లతో రోడ్లను నిర్మించామన్నారు. కాళేశ్వరం జలాలతో మండుటెండల్లో సైతం చెరువులను మత్తడి దుంకిస్తున్నామన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచిన తరువాత బండి సంజయ్ ఎప్పుడైనా మళ్లీ కనిపించాడా? అని ప్రశ్నించారు.
భూ కబ్జాదారులకు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందని, ఆయన గెలిస్తే, చెరువులు, కుంటలు కబ్జాలు అయిపోతాయని తెలిపారు. పచ్చని తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టొద్దని కోరారు. మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే కారుగుర్తుకే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పీ శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచ్‌లు దబ్బెట రమణారెడ్డి, మడికంటి మమత, జక్కం నర్సయ్య, ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దాడి సుధాకర్, జూవ్వాడి రాజేశ్వర్‌రావు, పెద్ది రమేశ్, బీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు కూర శ్యాంసుందర్ రెడ్డి, చింతల లక్ష్మణ్, నాగయ్య, గాండ్ల కొమురయ్య, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, సుంకిశాల సంపత్‌రావు, ముత్యం శంకర్‌గౌడ్, ఆరె శ్రీకాంత్, మంద రాజమల్లు, పబ్బతి రంగారెడ్డి, వొల్లాల సుదర్శన్ రెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, దాడి లచ్చయ్య, శ్రీరామోజ్ తిరుపతి, కూర శ్యాంసుందర్ రెడ్డి, దాడి లచ్చయ్య, దాడి లక్ష్మణ్, ఆశోక్, తిరుపతి యాదవ్, ఆశోక్, ఆకుల కిరణ్, అజయ్, బుర్ర ప్రణయ్, తప్పట్ల నరేశ్, ప్రవీణ్‌రెడ్డి, గర్వంధ శ్రీనివాస్, మహేశ్ పాల్గొన్నారు.