karimnagar | కమాన్ చౌరస్తా, మార్చి 29 : రేకుర్తిలోని విజన్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ సంబరాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పీపీ2(యూకేజీ) పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు.
భవిష్యత్తులో విద్యార్థులందరూ ఒక ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను నేర్చుకొని, వారందరూ ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరికీ కిండర్ గ్రాడ్యుయేషన్ పట్టాలను వారి తల్లిదండ్రులతో కలిపి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ఆటపాటలు, నృత్యాలు అందరినీ ఎంతగానో అలరించాయి . ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ మల్లయ్య, వెంకట్ ప్రిన్సిపాల్ రాజిరెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.