Vishwakarma Yagna Mahotsavam | చిగురుమామిడి, ఆగస్టు 31: చిగురుమామిడి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి సదాచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17న నిర్వహించే ఈ కార్యక్రమానికి మండలంలోని విశ్వబ్రాహ్మణులందరూ హాజరుకావాలని నాయకులు కోరారు.
సెప్టెంబర్ 17న విశ్వకర్మ యజ్ఞ మహోత్సవమును ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని విశ్వబ్రాహ్మణ సంఘం మండల నాయకులు శ్రీ రామోజ్ రాజ్ కుమార్, గొల్లపల్లి సదాచారి ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు చెల్లోజు రాజు, కొత్తపల్లి సత్యనారాయణ, గర్రెపల్లి శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొన్నారు.