Vinayaka Navarathri | కోరుట్ల, ఆగస్టు 30: బహ్రెయిన్ లోని నాస్ లేబర్ క్యాంపులో తెలంగాణ ప్రజలు వినాయక నవరాత్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. గణనాథుడికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపి, గణపతి బప్పా మోరియా అంటూ ఆటపాటలతో భజనలు చేశారు.
కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతాలకు చెందిన కుటుంబాలే కాకుండా, వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబ వాసులు పాల్గొని, ఆట పాటలతో సంబురాల్లో పాల్గొన్నారు. కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరిసేలా దీవించాలని గణనాథుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, , ఉత్కం కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.