తిమ్మాపూర్, జూన్ 30: భారీ లోడ్లతో వెళ్తున్న గ్రానైట్ లారీలను తిమ్మాపూర్ (Thimmapur) మండలం రామకృష్ణ కాలనీ గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. గ్రానైట్ లారీతో గ్రామంలో రోడ్డు ధ్వంసమవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలో గ్రామం మీదుగా వెళ్తున్న గ్రానైట్ లారీలను అడ్డగించామని మాచర్ల అంజయ్య చెప్పారు. తిమ్మాపూర్ శివారులో ఉన్న గ్రానైట్ క్వారి నుంచి వెళ్తున్న లారీల వల్ల దారులాన్ని పాడవుతున్నాయని ఆరోపించారు. అలాగే రాజీవ్ రహదారి పైన కొద్ది దూరం రాంగ్ రూట్లో వెళ్తుండడంతో వాహనదారులకు ఇబ్బందుల అవుతున్నాయని చెప్పారు. భారీ వాహనాలతో ఇండ్ల ముందు ఉన్న నీటి పైపులైన్లు పగులుతున్నాయని, చిన్న పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకొని లారీల సమస్యను లేకుండా చేయాలన్నారు. సమస్య ఇలానే ఉంటే లారీలను కదలనిచ్చేదిలేదని హెచ్చరించారు.