Survey | వీర్నపల్లి , జూన్ 19 : ఏండ్ల నుంచి సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వీర్నపల్లి మండలం రంగంపేటలో గురువారం ఉద్రిక్తత నెలకొంది.పట్టాలు లేని పోడు భూముల్లో రెండోరోజు సర్వే చేయడానికి ఎఫ్ఎస్వో పద్మలత, బేస్ క్యాంపు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు, పోడు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అటవీ శాఖ అధికారులను వారు అడ్డుకున్నారు. తము సాగు చేసుకుంటున్న భూముల్లోకి అధికారులను వీల్లనీయకుండా రోడ్డుపై బైఠాయించారు. సుమారు ముప్పే ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న తమ భూములను లాక్కొని ఫ్లాంటేషన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.