CPI Village committees | చిగురుమామిడి, ఏప్రిల్ 20 : మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) బలోపేతం కోసమే మండలంలోని అన్ని గ్రామాల్లో సీపీఐ గ్రామ శాఖ కమిటీలు, మహాసభలు జరుగుతున్నాయని, ఆ మహాసభల్లో గ్రామాల వారీగా నూతన కమిటీని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని కమిటీలను నూతనంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందుర్తి కార్యదర్శిగా ఎండీ ఉస్మాన్ పాషా, గాగిరెడ్డి పల్లె కార్యదర్శిగా మంద ఎల్లయ్య, ఓగులాపూర్ కార్యదర్శిగా ఇల్లందుల రాజయ్య, రేకొండ కార్యదర్శిగా బోయిని సర్దార్ వల్లభాయ్ పటేల్, ముల్కనూర్ కార్యదర్శిగా పైడిపెల్లి వెంకటేష్, సుందరగిరి కార్యదర్శిగా ఎలగందుల రాజు, రామంచ కార్యదర్శిగా కాత మల్లయ్య, ముదిమాణిక్యం కార్యదర్శిగా కాదాసు మోహన్, లంబాడిపల్లె కార్యదర్శిగా కయ్యం తిరుపతి, పెద్దమ్మ పల్లి కార్యదర్శిగా నీల వెంకన్నను ఎన్నుకున్నట్లు స్వామి, లక్ష్మారెడ్డి లు తెలిపారు.
పదిగ్రామాల శాఖ మహాసభలు పూర్తి అయ్యాయని, ఈ నెలాఖరు వరకు మిగిలిన గ్రామాల శాఖల మహాసభలు నిర్వహించిన అనంతరం మండల మహాసభ జరుపుతామని వారు తెలిపారు.