Best staff Award | పెద్దపల్లి, డిసెంబర్3 : పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న సిబ్బందికి, వారి పని తీరు ఆధారంగా ప్రతీ నెల ఒక్కరికి ఉత్తమ సిబ్బంది అవార్డు ఇస్తున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ కొండా శ్రీధర్ తెలిపారు.
ఈ మేరకు నవంబర్ మాసానికి గానూ స్టాఫ్ నర్స్ విజ్జు భాయ్‌కి ఉత్తమ సిబ్బంది అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగంలో పోటీతత్వంతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ విజయ్ కుమార్, జమున నర్సింగ్ సూపరింటెండెంట్ జమున, సిబ్బంది పాల్గొన్నారు.