Vemulawada | వేములవాడ, ఫిబ్రవరి 23 : వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ ను బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆయన కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్ ను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
మేనేజర్ సంపత్ రెడ్డికి కూడా పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రామతీర్థపు మాధవి, ఏనుగు జ్యోతి, వాసాల లావణ్య, వెంగల అనిత, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.