Vemulawada | వేములవాడ, జూలై 28 : వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరదనిటితో నుండి చెరువును తలపిస్తోంది. సోమవారం రాత్రి కురిసిన కళాశాలకు రెండు వైపులా ఉన్న రహదారుల నుండి వచ్చిన వరద నీరు దిగువ ప్రాంతంగా ఉన్న కళాశాల మైదానంలోకి చేరుతోంది. చేరిన వరద నీటితో కళాశాలలోని విద్యార్థులు అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రెండు, మూడు రోజులపాటు వర్షపునీరు నీళ్లు వాడడంతో దోమలతో వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పైనుంచి వచ్చే వరద నీరు కళాశాల మైదానంలోకి చేరకుండా శాశ్వతమైన పరిష్కారం కావాలని కళాశాల విద్యార్థులు కోరుతున్నారు.