Traffic ACP Srinivas | పెద్దపల్లి టౌన్ అక్టోబర్ 6 : ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధించనున్నట్లు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ సీహెచ్ శ్రీనివాస్ హెచ్చరించారు. పెద్దపెల్లి పట్టణంలోని కమాన్ చౌరస్తాలో నంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు గురువారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఇష్టం వచ్చినట్లు రోడ్లపై వాహనాలు నిలపడం ద్వారానే అనేకం జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితిలో రోడ్లపై భారీ వాహనాలు నిలపరాదని ఆదేశించారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని, రోడ్లపై తిరిగే వాహనాలకు తప్పనిసరిగా అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉండాలని, ప్రతీ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.
పెండింగ్ ఛానళ్లు చెల్లించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న ట్రాఫిక్ నిబంధనలకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపాలని కోరారు. ఆయన వెంట ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ తో పాటు సిబ్బంది ఉన్నారు.