Odela | ఓదెల, ఆగస్టు 18 : మడక మత్స్య సహకార సంఘానికి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నికలను మంగళవారం నిర్వహించారు. జిల్లా సహకార సంఘం ఎన్నికల అధికారులు సీనియర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, మహమ్మద్ ముఫాసిర్ అహ్మద్ లు వచ్చారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు.
అధ్యక్షుడిగా వీరవేని మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా ఆళ్ల అరుణ్, ప్రధాన కార్యదర్శిగా తూడి శ్రీనివాస్, డైరెక్టర్లుగా అనవేన కుమారస్వామి, తూడి రాజు, రాయల వేణ రాకేష్, ఆళ్ల హరీష్, తూడి రాజయ్య, అనవేని నరసయ్యలు ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల అధికారులు గెలిచినట్లు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. సర్పంచ్ ఆవాల ప్రసాద్, వార్డు సభ్యులు, మత్స్యకారులు శాలువాలతో నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఎన్నికల సందర్భంగా పొత్కపల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించారు.