కరీంనగర్ విద్యానగర్, నవంబర్ 24 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్‌సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వర్ష జ్యువెల్లర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ షాప్‌ను ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్‌సింగ్, మేయర్ వై సునీల్‌రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఆరెపల్లి మోహన్, నాయకులు చల్ల హరిశంకర్, నిర్వాహకులు ఎలగందుల వీరేశం, పెద్ది వేణుగోపాల్, బోడ్ల రాజు, వారి కుటుంబసభ్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.