Vanamahotsavam | చిగురుమామిడి, ఆగస్టు 1 : చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సాంబారి భారతమ్మ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇందుర్తి, నల్లగొండ రహదారుల వైపు 1300 మొక్కలు నాటారు. గ్రామస్తులకు 300 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని సర్పంచ్ భారతమ్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి స్వప్న, వార్డు సభ్యుడు మహమ్మద్ రజాక్, మాజీ ఎంపీటీసీ సాంబారి కొమురయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మారేళ్ళ రేణుక, గ్రామస్తులు పాల్గొన్నారు.