Vana Mahotsavam | కొమిర ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవం.. మొక్కలు నాటిన గ్రామస్తులు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ గోలి లింగారెడ్డి ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Vana Mahotsavam | ఓదెల, ఆగస్టు 25 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ గోలి లింగారెడ్డి ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వివిధ రకాల పూల మొక్కలను నాటారు. అనంతరం గ్రామ ప్రజలకు పూల, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.
సర్పంచ్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు పెంచడం ద్వారా గ్రామాన్ని పచ్చని వాతావరణంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్వశక్తి మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

