చొప్పదండి, జనవరి 2: పట్టణంలోని శివకేశవ ఆలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వేద పండితుల సమక్షంలో నిర్వహించిన విష్ణు, శ్రీదేవి-భూదేవి, పార్వతి-పరమేశ్వరుల కల్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సరస్వతీదేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, ఎమ్మెల్యే సతీమణి సుంకె దీవెన, కౌన్సిలర్ దండె జమున-కృష్ణ, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు దూస రాము, కార్యదర్శి దండె శ్రీనివాస్, కోశాధికారి సిరిపురం తిరుపతి, తాటిపల్లి అంజయ్య, పూసాల భూమేశ్, అర్చకులు జనగామ సత్యనారాయణ, సింహాచలం మురళి, సింహాచలం ప్రభాకర్, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
గంగాధరలో..
గంగాధర, జనవరి 2: మధురానగర్ కోదండ సీతారామచంద్రస్వామి, గర్శకుర్తి వేంకటేశ్వర స్వామి , కోట్లనర్సింహులపల్లి లక్ష్మీనర్సింహస్వామి, ఒద్యారం వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో సోమవారం వైకుంఠ ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. సర్పంచులు అలువాల నాగలక్ష్మి, వేముల లావణ్య, తోట కవిత, ఆలయ కమిటీ అధ్యక్షులు కల్వకోట శ్రీనివాసరావు, వొడ్నాల రాజిరెడ్డి, నాయకులు వేముల అంజి, అలువాల తిరుపతి, భక్తులు పాల్గొన్నారు.
రామడుగులో..
రామడుగు, జనవరి 2: వెలిచాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, నిత్య కల్యాణం నిర్వహించారు. సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్‌రావు, మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత, భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.