Urea shortages | మానకొండూర్ రూరల్, సెప్టెంబరు 12: మానకొండూర్ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం ముందు శుక్రవారం యూరియా బస్తాల కోసం బారులు తీరారు. దుకాణం తీయక ముందే రైతులు బారులు తీరారు.
ఒక్కలోడ్ (340 బస్తాలు) రాగా , మూడు రోజుల ముందు రశీదులు తీసుకున్న రైతులు ఒక్కొక్క రైతుకు ఒక్క బస్తా చొప్పున పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.