Urea distribution | కోరుట్ల : కోరుట్ల మండలంలోని ఐలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంఘం ఆధ్వర్యంలో యూరియాను పోలీసుల పహారా మధ్య బుధవారం పంపిణీ చేశారు. ఈ మేరకు 440 బస్తాలు రాగా యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో యూరియా పంపిణీ గోదాం వద్దకు చేరుకున్నారు. దీంతో గందరగోళం పరిస్థితి నెలకొంది. సహకార సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు ఎస్సై రామచందర్ చేరుకొని రైతులతో మాట్లాడి ఎకరానికి ఒక బస్తా ఇస్తామని సహకార సిబ్బంది చెప్పడంతో సరిపోదని రైతులు సహకార సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఇప్పటివరకు యూరియా తీసుకొని రైతులకు ఎకరానికి రెండు బస్తాలు తీసుకున్న వారికి ఒక బస్తా పంపిణీ చేస్తామన్నారు రైతుల ఆధార్ కార్డు పాస్ బుక్ ఆన్లైన్ చేస్తూ యూరియాను పంపిణీ చేస్తున్నారు. అలాగే మాదాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 230 యూరియా బస్తాలు రాగా రైతులు సహకార సంఘానికి యూరియా కోసం చేరుకున్నారు. కాగా యూరియాతో వచ్చిన లారీలో 460 బస్తాలు ఉన్నాయి.
మాదాపూర్ సహకార సంఘానికి 430 వేరే మండల సహకార సంఘానికి 430 లారీలో ఉన్నాయి. మొత్తం యూరియాను ఇక్కడ దించాలని, రైతులు లారీని అడ్డుకుని ఆందోళన చేపట్టారు. దీంతో ఎస్ఐ చిరంజీవి రైతులతో మాట్లాడి లారీని పంపించేశారు. రైతులకు యూరియాను మరో లారీ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని మాదాపూర్ సహకారసంఘం సిబ్బంది తెలిపారు.