Urea | మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 1: రైతులకు ఇంకా యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. తెల్లారిందంటే ఎక్కడ చూసినా యూరియా ఎక్కడ దొరుకుతుందో.. అనే దిగులే. ఇట్లాంటి బాధ ఇంకా తప్పడం లేదు. ఊటూరు సోసైటీ పరిధిలోని వేగురుపల్లిలో సోమవారం యూరియా కోసం రైతుల బస్తాలు వచ్చినట్లు తెలుసుకొని సోసైటీ సబ్ సెంటర్ కాడికి వచ్చి క్యూలైన్లో ఉండి ఎగబడ్డారు.
గత రెండు రోజులుగా యూరియా కోసం పడిగాపులు గాసిండ్రు, సోమవారం మధ్యాహ్నం బస్తాలు వచ్చినాయనితెలిసి వచ్చి లైన్లో ఉన్నారు. ఆధార్ కార్డును తీసుకొని ఒక్కొక్కరికి ఒక్క బస్తా చొప్పున రాత్రి వరకు అధికారులు పంపిణీ చేశారు. బస్తాల కోసం గొడవ పడగ గోదాం మూసివేసి నిర్వాహకులు వెళ్లారు. సరిపడా యూరియా బస్తాలు దొరకక చీకటి పడే రాక ఉన్న కూడా కొందరు బస్తాలు దొరకక పోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.