Bommanapally | చిగురుమామిడి, మే 30: గ్రామంలో పారిశుధ్యంకు ఆదర్శంగా ఉండాల్సిన గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో అపరిశుభ్రత చోటుచేసుకుంది. మండలంలోని బొమ్మనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో బాలవికాస కేంద్రం ఆధ్వర్యంలో తాగునీటి శుద్ధి కేంద్రంలో ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ వెనుక చెత్తాచెదారంతో పాటు నీరు నిల్వ ఉండడంతో దోమలు విధులు వ్యాప్తి చెంది దుర్గంధం పేరుకుపోయింది.
బాలవికాస పాలకవర్గం, గ్రామపంచాయతీ సిబ్బంది నీటి నిలువలను తొలగించి పరిశుభ్రత పాటిస్తే అంటూ వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చని గ్రామస్తులు కోరుతున్నారు. నిత్యం వందలాది మంది గ్రామపంచాయతీ కార్యాలయానికి, బాలవికాస తాగునీటి శుద్ధి కేంద్రానికి వస్తుంటారని గ్రామస్తులు పేర్కొన్నారు.