Dharmaram | ధర్మారం, మే 18: పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది మేడారం, కొత్తూరు గ్రామాలలో టెన్త్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఆదివారం ఎంతో ఉత్సాహంగా జరిగాయి. నంది మేడారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1992-93 విద్యా సంవత్సరంలో 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిపారు. 33 సంవత్సరాల క్రితం పదవ తరగతి వరకు పూర్తిచేసుకుని వెళ్లిపోయిన తర్వాత మళ్లీ స్నేహితులందరూ కలిసి పూర్వా విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు.
మిత్రులందరికీ కుటుంబ సమేతంగా ఒకరికొకరు కలుసుకొని భార్య, పిల్లలను పరిచయం చేసుకున్నారు. యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులను వారి సన్మానించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్వాహకులు మామిడిశెట్టి శ్రీనివాస్, వేల్పుల మల్లేశం, బద్దం మల్లారెడ్డి, సురకంటి లడ్డు తిరుపతిరెడ్డి, పాలకుర్తి వెంకటేశం గౌడ్, గుర్రం తిరుపతి గౌడ్, తదితరులు మిత్రులు పాల్గొన్నారు.
విద్యాభారతిలో ఆత్మీయ సమ్మేళనం
ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలోని విద్యాభారతి ఉన్నత పాఠశాలలో 2002-03 విద్యాసంవత్సరంలో పదవతరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని తమకు బాల్యంలో విద్యాబుద్దులు నేర్పించిన గురువులను శాలువా, మెమోంటోలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా గతంలోని మధుర జ్ఞాపకాలు గుర్తుకు చేసుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల వ్యవస్థాపకులు మరియు కరస్పాండెంట్ గోనె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ 2003 పదవతరగతి బ్యాచ్ నుండి ఆ సమయంలో మండల టాపర్ గా నిలిచిన ముగ్గురు విద్యార్థులు డాక్టర్ లుగా ఎదగటం గర్వకారణమని మిగిలిన విద్యార్థులు కూడా ఉన్నత స్థానాల్లోకి ఎదగటం తమకు ఎంతో సంతోషకరం అన్నారు.
పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల చైర్మన్ లక్ష్మీనారాయణ తమను సొంత బిడ్డలలాగ భావించి తమకు మార్గదర్శనం చేయటం, చదువు పూర్తయిన తర్వాత కూడా వ్యక్తిగత శ్రద్ద తీసుకొని జీవితంలో తాము ఎదగాడానికి చేసిన కృషిని ఈ జన్మలో మరువలేమన్నారు.ఈ సందర్బంగా విద్యాభారతి పాఠశాలతో ఉపాధ్యాయులతో తమకున్న ఆత్మీయ అనుభందాన్ని మరపురాని సంఘటలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు నూతి మల్లన్న, గన్ను సత్యనారాయణ రెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్, గుండ రత్నాకర్ రెడ్డి, ఆర్. ఉపేందర్, సురేందర్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.