Power supply | పెద్దపల్లి, జూన్21: జిల్లాలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో విద్యుత్ శాఖ అధికారులతో శనివారం కల్టెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
7 సబ్ డివిజన్ పరిధిలో అవసరమైన మేర విద్యుత్ పోల్స్ అందుబాటులో పెట్టుకోవాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా లూజ్ వైర్లను టైట్ చేయాలన్నారుజిల్లాలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో విద్యుత్ శాఖ అధికారులతో శనివారం కల్టెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.. జిల్లాలోని ఒక మండలాన్ని ఎంపిక చేసుకొని, సోలార్ పవర్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో విద్యుత్ శాఖ పెద్దపల్లి ఎస్ఈ కంకటి మాధవ రావు, డీఈలు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.