Godavarakhani | ఫర్టిలైజర్ సిటీ, జూన్ 21: గోదావరిఖని -1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విఠల్ నగర్ ఏరియాలో ఒక వ్యక్తి పడి పోయి ఉండగా 108 అంబులెన్స్ వారు ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకురాగా డాక్టర్స్ అతనిని పరీక్షించారు. కాగా అప్పటికే సదరు వ్యక్తి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఫొటో లోని వ్యక్తి వివరాలు తెలియరాలేదని, మృతదేహాన్ని మార్చూరులో భద్రపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. కావున ఎవరైనా గుర్తించినట్లయితే గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి 8712656516 గారికి సమాచారం అందించగలరు.