Kalavakuntla Vidyasagar Rao | మల్లాపూర్, డిసెంబర్ 19: మాజీ సీఎం కేసీఆర్ పాలనలోని పట్టణాలకు దీటుగా పల్లెలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని రేగుంట గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో అధిక మెజారిటీతో సర్పంచ్ గా గెలుపొందిన లహరి, ఉప సర్పంచ్ గా నందిని తోపాటు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.
అనంతరం గుండంపల్లి, సాతారం ఓటమిపాలైన అభ్యర్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గం లో రేగుంటలో గ్రామంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, దీనికి ఉదాహరణగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి 800 ఓట్ల మెజార్టీ రావడమే నిదర్శనమని ప్రసశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలిపారు. ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.