Thimmapur | తిమ్మాపూర్, జూన్ 27 : తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు శనివారం తిమ్మాపూర్ లో మాదకద్రవ్యాల పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరుగుతూ ర్యాలీ తీశారు. ‘అంకుల్.. మాదకద్రవ్యాలు వద్దు’ అంటూ.. అవి అనారోగ్యం అని వివరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సరిత మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం విద్యార్థులు ప్రతిజ్ఞ చేయించారు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.