రాజన్నసిరిసిల్ల, జూలై 1 (నమస్తే తెలంగాణ): అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝులిపించారు. బాధితుల ఫిర్యాదు, ఎస్పీ ఆ దేశాలతో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో శనివారం 14 బృందాలు ఏకకాలంలో వడ్డీ వ్యా పారుల ఇండ్లల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. ఎనిమిదిని అదుపులోకి తీసుకొని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. వీరి నుంచి చెక్కు లు, రిజిస్ట్రేషన్ కాగితాలు, ప్రామిసరీ నోట్లతో పాటు రూ. 13. 95లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమవడ్డీ వ్యాపారం చేస్తూ మి త్తిల కోసం ఇబ్బందులు పెడుతున్నారని పలువురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆ యన సీఐలు మొగిళి, ఉపేందర్, కృష్ణకుమార్, కరుణాకర్, వెంకటేశ్, ఎస్ఐలు మారుతి, కిరణ్‌కుమార్, శ్రీనివాస్, తిరుపతి, బాలకృష్ణ, వెం కట్రాజం, లక్షారెడ్డి ప్రేమదీప్, నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు టీంలను ఏర్పాటు చేసి తనిఖీ లు చేయించారు.
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదా చేసి భూ రిజిస్ట్రేషన్ పేపర్లు, రూ. 13లక్షల 95వేల 120 ల నగదు, రూ. 4,19,09, 250ల విలువైన 113 చెక్కులు, 71 ఖాళీ చె క్కులను స్వాధీనం చేసుకున్నారు. పబ్బ నాగరాజు వద్ద రూ. 2,80,14,250ల విలువైన 67 చెక్కులు, 10 ఖాళీ చెక్కులు, రూ. 4,లక్షల నగదు, బూట్ల నవీన్ కుమార్ వద్ద 3 ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేప ర్లు, మచ్చ కొండయ్య వద్ద రూ. 1,31,50, 000 విలువైన 42 చెక్కులు, రెండు ఖాళీ చెక్కు లు, 1 ప్రామిసరీనోటు, పాలకొండ శివప్రసాద్ వద్ద రూ. 74,50000 విలువైన 4 బ్యాంక్ చెక్కులు, 41 ఖాళీ చెక్కులు, 3 ల్యాం డ్ రిజిస్ట్రేషన్ పత్రాలు, దుసా దశరథం వద్ద 5 ప్రామిసరీ పత్రాలు, 18 బ్యాంకు చెక్కులు, రూ. 9,95,120 స్వాధీనం చేసుకున్నారు. వంగరి లక్ష్మణ్ (సిరిసిల) , గట్టు నారాయణ (సిరిసిల్ల) కాసన గొట్టు శ్రీనివాస్ (సిరిసిల్ల) అనుగుల ప్ర భాకర్, పెద్ద బాలరాజు (వేములవాడ), కటకం కిషన్ (వేములవాడ), కొమురవెల్లి శేఖర్ (వేములవాడ), ముద్రకోల వెంకటేశం (వేములవాడ)ను బైండోవర్ చేశారు.
అప్పు ఇవ్వడం నేరం కాదు: ఎస్పీ అఖిల్
ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ అప్పు తీ సుకోవడం, ఇవ్వడం నేరం కాదన్నారు. అయి తే ఆర్బీఐ, తెలంగాణ మనీ లాండింగ్ చట్టంలోని నిబంధనలు పాటిస్తూ ఫైనాన్స్‌లు నిర్వహించుకోవచ్చన్నారు. చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో పేదలను ఇబ్బందిపెడితే చట్ట ప్ర కారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. అక్రమ వడ్డీ వ్యాపారులపై జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరుగాగాని, డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.