Thimmapur | తిమ్మాపూర్, ఫిబ్రవరి2 : గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు రోజుకో తీరున మోసం చేస్తున్నారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, మొగిలిపాలెం గ్రామాల్లో సోమవారం ఉదయం గుర్తు తెలియనీ ఇద్దరు వ్యక్తులు తిరుగుతూ మహిళల బంగారు, వెండి ఆభరణాలు శుద్ధి చేస్తామంటూ నమ్మబలికారు.
వారి వద్ద ఉన్న ఒక కెమికల్ లో ఆభరణాలను వేసి శుద్ధి చేశామంటూ మహిళలకు తిరిగి ఇవ్వగా ఆభరణాలు చిన్నగా కావడంతో అనుమానం వచ్చిన వారు గ్రామంలో చెప్పడంతో తాము మోసపోయామని భావించి ఇద్దరు దుండగల కోసం గాలించగా మొగిలిపాలెం గ్రామ శివారులో ఒకరిని పట్టుకోగా.. మరొకరు తప్పించుకొని పారిపోయారు. స్థానికులు నిందితుడిని ఎల్ఎండీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. కాగా పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.