axident | మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 2: ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయలయ్యాయి. ఈఘటన బుధవారం చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసులు, 108 వాహన సిబ్బంది కథనం ప్రకారం.. మానకొండూర్ మండలం కెల్లేడు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అడెపు విఠల్, కోలాని బిట్టు బుధవారం మధ్యాహ్నం సమయంలో మోడల్ స్కూల్ సమీపంలో కరీంనగర్ జమ్మికుంట రోడ్డు పై వారి ద్విచక్ర వాహనంపై పచ్చునూర్ వైపుగా వెళ్తున్నారు. కాగా వీరు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీ కొట్టీ, మరో వెనకాలే వస్తున్న కారుకు వెనకాలే పడిపోయారు.
ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 ఫోన్ చేయగా సంఘటన స్థలంలో తీవ్రంగా గాయపడ్డ యువకులను 108 వాహనంలో కరీంనగర్ లోని ఓ ప్రైవేటు దవాఖానాలకు తరలించారు. కాగా అడెపు విఠల్ పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.