Vemulawada | వేములవాడ, మార్చి 16 : బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యాముల్ ను వెంటనే బహిష్కరించాలని వేములవాడ బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. బ్రాహ్మణుల పట్ల ఎమ్మెల్యే శ్యాముల్ వ్యాఖ్యలను వారు ఖండించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ప్రతీరోజు అన్ని మతాలను గౌరవిస్తూ సర్వేజనా సుఖినోభవంతు అంటూ తాము పూజలు చేస్తుంటే తమను కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే వైఖరి పట్ల కాంగ్రెస్ పార్టీ మౌనం వీడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగం మీద ప్రమాణం ఇతరుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వివరిస్తున్న తీరు కూడా స్పీకర్ పరిగణంలోకి తీసుకోవాలన్నారు. ఆయనను వెంటనే భర్తరఫ్ చేయాలన్నారు. పెద్ద ఎత్తున బ్రాహ్మణులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మధు రాధా కిషన్, కిషన్, మహిళలు తదితరులు ఉన్నారు.