Patients | సారంగాపూర్, జూన్ 20 : క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులకు అవసరమైన చికిత్సను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అందిస్తామని అన్నారు. ప్రభుత్వం నుండి అందే అటువంటి సహాయ సహకారాలను అందేలా చూస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ఇంపాక్ట్ ఇండియా సంస్థ ద్వారా చేపట్టడం జరిగిందిని, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్షయ వ్యాధి 2030 సంవత్సరం వరకు లేకుండా చూడాలనేదే లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మండలం వైద్యాధికారి రాధ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.