chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 26 : చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డి పల్లె ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోల రామచంద్రారెడ్డి పదవీ విరమణ ఈనెల 30తో ముగియనుండడంతో గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు సన్నిల్ల వెంకటేశం ఆధ్వర్యంలో గ్రామస్తులు సన్మాన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. రామచంద్రారెడ్డి పాఠశాల బలోపేతం కోసం విశేషంగా కృషి చేశారని, పిల్లలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దారని కొనియాడారు.
వీరి సేవలు పాఠశాలకు అన్ని విధాల వినియోగించాడనీ పేర్కొన్నారు. ఇలాంటి ప్రధానోపాధ్యాయుడు ఉద్యోగ విరమణ పొందడం బాధాకరమైనప్పటికీ, విద్యార్థులు, గ్రామస్తుల హృదయాల్లో స్థిరస్థాయిగా ఉంటాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సన్నీల వెంకటేశం, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కల్వల సంపత్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్ రెడ్డి, నాయకులు బొమ్మగాని పరశురాములు, గట్టు శ్రీనివాస్, గందె రమేష్, నరేందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.