Indurthi | చిగురుమామిడి, మార్చి 1 : చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో ట్రాక్టర్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా చెల్పూరి విష్ణుమాచారి, గౌరవాధ్యక్షుడిగా అప్పాల ముత్యం, ప్రధాన కార్యదర్శిగా పోతరవేణి కుమార్, ఉపాధ్యక్షుడిగా అందే సారయ్య, సలహాదారుడిగా కాంతాల శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లుగా కూన రాజు, బుర్కి సంతోష్, అప్పాల సంపత్, చింతపూల కిరణ్, ముక్కెర అనిల్, పోతరవేణి శ్రీనివాస్,కూన రామస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు విష్ణమాచారి మాట్లాడుతూ ట్రాక్టర్ యజమానుల సమస్యల పరిష్కారం కోసం తమవంతుగా కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.