Katnapalli | సుల్తానాబాద్ రూరల్ మే 28: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామానికి చెందిన వీరగోని బక్కయ్య (50) అనే గీత కార్మికుడు తాడిచెట్టు పైనుంచి పడి గాయాలు కాగా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. రోజువారీ గానే గ్రామ శివారులోని తాటి వనంలోకి బక్కయ్య గురువారం వెళ్లాడు.
వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కి కలు తీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే కరీంనగర్ దావఖానకు తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.