పేపర్ 1 : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలు
పేపర్ 2 : మధ్యాహ్నం 2.30 గంటల సాయంత్రం 5గంటలు
కరీంనగర్ పరీక్షా కేంద్రాలు : 154
అభ్యర్థుల సంఖ్య : 54,019
పెద్దపల్లి పరీక్షా కేంద్రాలు : 43
అభ్యర్థుల సంఖ్య : 17,927
సిరిసిల్ల పరీక్షా కేంద్రాలు : 50
అభ్యర్థుల సంఖ్య : 14,011
గ్రూప్-4 ఎగ్జామ్కు ఉమ్మడి జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 1,07,894 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, 320 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం పేపర్ -1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించనుండగా, సమయపాలన పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
– కమాన్ చౌరస్తా, జూన్ 20