తిమ్మాపూర్, అక్టోబర్ 25 : తిమ్మాపూర్ ఎడ్యూకేషన్ హబ్‌లా మారింది. మూడు ఇంజినీరింగ్ కాలేజీలు, మరెన్నో స్కూళ్లు ఉండగా, నిత్యం వేలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే కళాశాలలు, పాఠశాలలకు వచ్చిపోయేందు కు ఉదయం, సాయంత్రం చుక్కలు చూస్తున్నారు.
విద్యాసంస్థల వేళలకు అనుగుణంగా బస్సులు లేకపోవడం, వచ్చిన బస్సులు అప్పటికే మహిళ ఉచిత ప్రయాణం కారణంగా నిండిపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఎదురుచూపుల తర్వాత వచ్చిన ఒకటి, రెండు బస్సుల్లోనే ఎగబడుతున్నారు. కిక్కిరిసి, ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులను తిప్పాలని విద్యార్థులు కోరుతున్నారు.