సిరిసిల్ల సెస్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరలేవనున్నది. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు ఈనెల 24న పోలింగ్ జరుగనుండగా, నేటి నుంచి నామినేషన్ల జాతర మొదలు కానున్నది. ఈ నెల 15వ తేదీ దాకా ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, ఎస్టీ, ఎస్సీలకు వెయ్యి, బీసీలకు 2వేలు, ఇతరులకు 4వేల డిపాజిట్ నిర్ణయించింది. ఈ మేరకు యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలవుతుండగా, అప్పుడే రాజకీయం వేడెక్కుతున్నది.
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సెస్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరలేవనున్నది. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు 24న పోలింగ్ జరుగనుండగా, నేటి నుంచి నామినేషన్ల జాతర మొ దలు కానున్నది. ఈ నెల 15వ తేదీ దాకా ప్రతి రోజూ ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా, ఈ మేరకు రంగంలోకి దిగిన యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. అప్పుడే రాజకీయం వేడెక్కుతున్నది.
నామినేషన్ రుసుం ఇదే..
అభ్యర్థులకు నామినేషన్ రుసుంను ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు వెయ్యి, బీసీలకు 2వేలు, ఇతరులకు 4 వేలుగా నిర్ణయించింది. నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే ఓటరు జాబితాను అందజేస్తున్నారు. ప్రతి పేజీకి నాలుగు రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని డీసీవో బుద్దానాయుడు తెలిపారు. డైరెక్టర్ స్థానాలకు పోటీ చేస్తున్న ఆశావహులం తా ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ పత్రాలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సహకార శాఖ అధికారులంతా ఎన్నికల వి ధుల్లో పాల్గొంటున్నారు. వివిధ మండలాల నుంచి వచ్చే అభ్యర్థులు పత్రాలు దాఖలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీగా తగ్గిన ఓటర్లు
సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ పరిధిలో మొత్తం 1,68,025 మంది వినియోగదారులున్నారు. వీరందరికీ ఓటు హక్కు ఉంది. ఒక్కొక్కరి పేరిట అనేక విద్యుత్ మీటర్లు ఉన్నప్పటికీ ఒకే ఓటు వేసే అవకాశముంటుంది. బైలా ప్రకారం ఎన్నికల్లో పో టీ చేయాలన్నా, ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా మూడు నెలల బకాయిలు ఉండకూడదన్న నిబంధనలున్నాయి. అధికారులు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బకాయిలు చెల్లింపునకు నెల రోజుల పాటు వినియోగదారులకు అవకాశం కల్పించారు. కానీ, ఇప్పటివరకు 87,130 మంది మాత్ర మే ముందుకు వచ్చి బకాయిలు చెల్లించారు. దీంతో సగానికి సగం ఓటరు శాతం తగ్గింది. 2016 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 1,68,025 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈ ఎన్నికల్లో మాత్రం 80,895 మంది బకాయిలు పడ్డ కారణం గా ఓటు హక్కును వినియోగించుకోలేక పో తున్నారు. కాగా ముగ్గురు పిల్లలున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తంగళ్లపల్లి మండలంలోని 7 గ్రామాలను సిరిసిల్ల టౌన్-2 డైరెక్టర్ స్థానంలో కలిపారు. అలాగే వేములవాడ రూరల్ మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీని వేములవాడ టౌన్-1 డైరెక్టర్ స్థానంలో కలిపారు. బోయినిపల్లి మండల స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు. సిరిసిల్ల డైరెక్టర్ 1, వేములవాడ డైరరెక్టర్ 1 స్థానాలను మహిళకు కేటాయించారు. మహిళా ఓటర్లు, కులాల వారీగా ఓటర్లను లెక్కించకుండా రిజర్వేషన్లు కల్పించడాన్ని, బకాయిలున్న వారి ఓటు హక్కును తొలగిస్తూ అధికారులు తీసుకున్న చర్యలను సవాల్ చేస్తూ బోయినిపల్లి మండలం విలాసాగర్కు చెందిన సెస్ మాజీ డైరెక్టర్ లక్ష్మి భర్త కనకయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు జరుగుతున్న ఎన్నికలపై మళ్లీ పిటిషన్ దాఖలు కాగా, దీనిపై నేడు జరిగే విచారణలో వచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులు వీరే..
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరుస్తున్న డైరెక్టర్ అభ్యర్థుల వివరాలను పా ర్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రకటించారు. సిరిసిల్ల-1 డైరెక్టర్ స్థానానికి దిడ్డి రమాదేవి (బీసీ), సిరిసిల్ల-2 దార్నం లక్ష్మీనారాయణ (బీసీ), ముస్తాబాద్ స్థానానికి సందుపట్ల అంజిరెడ్డి(జనరల్), ఎల్లారెడ్డిపేట వర్స కృష్ణహరి (బీసీ), వీర్నపల్లి మాడ్గుల మల్లేశం (బీసీ), ఇల్లంతకుంటకు మల్లుగారి రవీందర్రెడ్డి(జనరల్) ప్రకటించారు. మిగతా తొమ్మిది స్థానాలకు ప్రకటించాల్సి ఉంది.